రైల్వే గేటు కిందకు వస్తుండగా ట్రాక్ పై కారు నిలిచిపోవడంతో కలకలం
రిపోర్టర్: సురేష్
స్థలం: Kerala
కేరళలో రైల్వే గేట్లు మూసుకుంటున్న సమయంలో పట్టాలు దాటేందుకు ప్రయత్నించిన ఒక మహిళ కారు రైలు పట్టాలపై ఇరుక్కుపోయినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ప్రాణభయంతో కారులోని వారు వెంటనే కిందకు దిగి ప్రాణాలు కాపాడుకోగా, సుమారు ముప్పై నిమిషాల పాటు రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అక్కడికి చేరుకున్న పోలీసులు టౌ ట్రక్కు సహాయంతో వాహనాన్ని పక్కకు తొలగించి పరిస్థితిని సమీక్షించారని ప్రత్యక్ష సాక్షులు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.