పాట్నాలో దేశంలోనే తొలి బాధితుల హక్కుల కేంద్రం ప్రారంభం
రిపోర్టర్: రాజేష్
స్థలం: పాట్నా
దేశంలోనే మొట్టమొదటి బాధితుల హక్కుల కేంద్రాన్ని బీహార్లోని పాట్నాలో ప్రారంభించినట్లు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. బీహార్ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ పైలట్ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుందని అధికారులు పేర్కొన్నారు. నేర బాధితులకు ఒకేచోట న్యాయ, వైద్య, ఆర్థిక సహాయం అందించడమే ఈ సింగిల్ విండో వ్యవస్థ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు స్పష్టం చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు నుంచి ట్రయల్, అప్పీల్ వరకు బాధితులకు పూర్తి అండగా ఉంటామని స్పష్టం చేశారు.