రోడ్డు ప్రమాదంలో గాయపడిన గురుకులం విద్యార్థినులను పరామర్శించిన సోమిరెడ్డి

రిపోర్టర్: సురేష్ స్థలం: సర్వేపల్లి

సర్వేపల్లి మండలం మహాలక్ష్మిపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన కోడూరు గురుకులం విద్యార్థినులను నెల్లూరు జీజీహెచ్లో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి శుక్రవారం పరామర్శించారు. ఫీల్డ్ ట్రిప్నకు వెళ్లి వస్తున్న విద్యార్థినుల ఆటోను మరో ఆటో ఢీకొనడంతో ఎనిమిది మంది విద్యార్థినులు, ఒక ఉపాధ్యాయురాలు గాయపడ్డారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని వైద్యాధికారులను అడిగి తెలుసుకున్న ఆయన, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు స్పష్టమైన సూచనలు చేశారు.