వర్ధన్నపేట శవపరీక్ష గదిలో ఎలుకలు కొరికేసిన మృతదేహం కన్ను

రిపోర్టర్: BHANUCHANDER DOMMATI స్థలం: వర్ధన్నపేట

వర్ధన్నపేట శవపరీక్ష గదిలో అధికారుల తీవ్ర నిర్లక్ష్యం వెలుగుచూసింది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రాయపర్తి మండలానికి చెందిన గారే వీరయ్య మృతదేహం కంటి భాగాన్ని ఎలుకలు కొరికేయడం కలకలం రేపింది. ఆదివారం ఉదయం శవపరీక్ష కోసం వెళ్లిన కుటుంబ సభ్యులు ఈ దృశ్యాన్ని చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పోస్టుమార్టం గదిలో కనీస మౌలిక వసతులు, ఫ్రీజర్ సౌకర్యం లేకపోవడం వల్లే ఈ దారుణం జరిగిందని మృతుడి బంధువులు ఆరోపించారు.