యువకుడి వైద్యం కోసం రూ. రెండు లక్షల సాయం అందించిన ఎమ్మెల్యే

రిపోర్టర్: KOLA MAHESH స్థలం: నారాయణపురం

సంస్థాన్ నారాయణపురం మండలం డాకుతండా పరిధిలోని కోపులతండాకు చెందిన మెగావత్ రాకేష్ బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న స్థానిక నాయకులు రాకేష్ పరిస్థితిని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే స్పందించి అందించిన రూ. రెండు లక్షల ఆర్థిక సహాయం చెక్కును మండల నాయకులు హైదరాబాద్ ఆసుపత్రిలో రాకేష్ తల్లిదండ్రులకు అందజేశారు. కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.