పర్యావరణ హితం కోసం మట్టి గణపతి ప్రతిమలను తయారు చేసిన పంతంగి విద్యార్థులు!
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలోని పాఠశాలలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా విద్యార్థులు మట్టి గణపతి ప్రతిమలను స్వయంగా తయారు చేశారు. పర్యావరణహిత వినాయక విగ్రహాల వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని మట్టితో అందమైన ప్రతిమలను రూపొందించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయులు మంజుశ్రీ తదితరులు పాల్గొన్నారు.