ఇంద్రకీలాద్రిపై దసరా శోభ: మూలా నక్షత్రం వేళ భక్తుల భారీ ప్రవాహం
రిపోర్టర్: రమేష్
స్థలం: ఎన్టీఆర్
విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా మహోత్సవాల్లో ఆరో రోజైన మూలా నక్షత్రం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారని కలెక్టర్ ఎన్టీఆర్ జిల్లా (Collector NTR District) వెల్లడించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జిల్లా యంత్రాంగం అన్ని శాఖల సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టిందని, అలాగే చిన్నారులు తప్పిపోకుండా క్యూఆర్ కోడ్ ట్యాగ్ లతో ప్రత్యేక రక్షణ చర్యలు అమలు చేసినట్లు ఆయన తెలిపారు.