పోలీస్ ఫ్లాగ్ డే పోటీల విజేతలను అభినందించిన సీపీ రమేష్
రిపోర్టర్: కిరణ్
స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి
పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాల్లో భాగంగా సైబరాబాద్ పోలీస్ సిబ్బందికి నిర్వహించిన తెలుగు మరియు ఆంగ్ల వ్యాసరచన పోటీల విజేతలను సీపీ డాక్టర్ ఎం.రమేష్ అభినందించినట్లు సైబరాబాద్ పోలీస్ వెల్లడించారు. సిబ్బందిలో దాగి ఉన్న ప్రతిభను, సృజనాత్మకతను వెలికితీసి ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ పోటీల్లో పాల్గొని విజయం సాధించిన పలువురు సిబ్బందిని పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించడంతో పాటు ప్రశంసాపత్రాలు అందజేశారు.