ట్రేడింగ్ పేరుతో రిటైర్డ్ ఉద్యోగికి రూ.70 లక్షల టోకరా

రిపోర్టర్: సునీల్ స్థలం: విజయవాడ

పెనమలూరు మండలంలో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. అధిక లాభాల ఆశ చూపి రిటైర్డ్ ఉద్యోగి నుంచి విడతల వారీగా రూ.69.75 లక్షలు కాజేశారు. వాట్సాప్ ప్రకటనను నమ్మి మోసపోయిన బాధితుడు, అప్పులు చేసి బంగారం అమ్మి మరీ డబ్బు చెల్లించాడు. మోసం గ్రహించి పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.