విజయనగరంలో పణుకువలస వంతెన రక్షణ గోడ కూలిపోవడంతో రాకపోకలు బంద్‌

రిపోర్టర్: నరేష్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా తెర్లాం మండలం పణుకువలస వద్ద ఆంగ్లేయుల కాలం నాటి శిథిలావస్థ వంతెన రక్షణ గోడ శుక్రవారం కూలిపోయింది. ఈ మార్గంలో భారీ వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వంతెన దుస్థితిపై గతంలో ‘ఈనాడు’ పదేపదే హెచ్చరించినా అధికారులు పట్టించుకోకపోవడం వల్లనే ఈ ప్రమాదం సంభవించింది. ప్రస్తుతం ద్విచక్ర వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు.