అనుమాన పక్షి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయని తెలిపిన హీరో రాగ్ మయూర్

రిపోర్టర్: శివ స్థలం: హైదరాబాద్

డీజే టిల్లు ఫేమ్ డైరెక్టర్ విమల్ కృష్ణ దర్శకత్వంలో రాగ్ మయూర్ హీరోగా తెరకెక్కిన అనుమాన పక్షి చిత్రం సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో చిత్ర యూనిట్ సినిమాపై తమ కాన్ఫిడెన్స్‌ను వ్యక్తం చేసింది. ఇప్పటివరకు చూడని విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కిందని, ప్రేక్షకులందరికీ సరికొత్త వినోదాన్ని అందిస్తుందని మేకర్స్ తెలిపారు.