జైలర్ 2 చిత్రంలో సూరజ్ వెంజరమూడు పాత్రను పరిచయం చేసిన మేకర్స్
రిపోర్టర్: శివ
స్థలం: India
సూపర్‌స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న జైలర్ 2 సినిమా నుంచి మేకర్స్ ప్రమోషన్స్‌ను ప్రారంభించారు. ఇందులో భాగంగా మలయాళ స్టార్ నటుడు సూరజ్ వెంజరమూడు దిలీప్ అనే అత్యంత పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నట్లు మొదటి క్యారెక్టర్ ప్రోమోను విడుదల చేశారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.