గర్భంతో ఉన్నప్పుడు షూటింగ్ చేయడంపై పరిణీతి చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు
రిపోర్టర్: అశోక్
స్థలం: India
ప్రముఖ బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ 'షక్: ట్రస్ట్ నో వన్' ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో తన ప్రెగ్నెన్సీ అనుభవాలను పంచుకున్నారు. షూటింగ్ సమయంలో దర్శకులు, నిర్మాతలు తనకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఎంతో సహాయం చేశారని తెలిపారు. భర్త రాఘవ్ చద్దా షిమ్లాకు వచ్చి తనను చూసుకున్నారని, ఈ సిరీస్ ద్వారా తనతో పాటు తన బిడ్డ 'నీర్' కూడా డెబ్యూ చేస్తుందని సరదాగా వ్యాఖ్యానించారు.