డక్కిలి మండలంలో జోరుగా సాగుతున్న ఎంపీటీసీ నామినేషన్ల పర్వం

రిపోర్టర్: kummaragunta masthanaiah స్థలం: డక్కిలి

తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ రెండవ రోజు కొనసాగింది. వివిధ స్థానాలకు మొత్తం నరవై ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఇరవై ఏడు మంది, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇరవై మంది దరఖాస్తులు సమర్పించారు. బహుజన సమాజ్ పార్టీ తరఫున ఒకరు జడ్పిటిసి నామినేషన్ వేశారు. ఎస్సై బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు.