ఇండిగో విమానయాన సంస్థ తీరుపై అస్సాం ఎమ్మెల్యే అఖిల్ గొగోయ్ ఆగ్రహం

రిపోర్టర్: నరేష్ స్థలం: Delhi

ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల తాను విమానం కోల్పోవలసి వచ్చిందని అస్సాం ఎమ్మెల్యే అఖిల్ గొగోయ్ ఆవేదన వ్యక్తం చేశారు. బోర్డింగ్ గేట్ మార్పు గురించి ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ప్రయాణికులను మోసం చేస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎటువంటి సమాచారం లేకుండా గేట్ నంబర్ మార్చడం, ప్రశ్నిస్తే గ్రౌండ్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించడం చాలా బాధాకరమని పేర్కొంటూ ఢిల్లీ నుంచి గౌహతి వెళ్లవలసిన సమయంలో ఎదురైన చేదు అనుభవాన్ని సామాజిక మాధ్యమాలలో పంచుకున్నారు.