బ్రిటನ್ పైలట్లకు శిక్షణ ఇవ్వనున్న భారత వైమానిక దళ పైలట్లు

రిపోర్టర్: కృష్ణ స్థలం: న్యూఢిల్లీ

బ్రిటన్‌లోని రాయల్ ఎయిర్ ఫోర్స్ పైలట్లకు శిక్షణ ఇచ్చేందుకు భారతీయ వైమానిక దళానికి చెందిన ముగ్గురు క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్లు వేల్స్‌లోని ఆర్ఏఎఫ్ వ్యాలీకి చేరుకున్నారు. వందేళ్ల వైమానిక చరిత్రలో బ్రిటన్ పైలట్లకు భారతీయ పైలట్లు శిక్షణ ఇవ్వడం ఇదే మొదటిసారి కావడం విశేషం. భారత్, యూకే రక్షణ రంగ సహకారంలో ఇది సరికొత్త మైలురాయిగా నిలిచింది.