అనంతపురంలో మున్సిపల్ ఎన్నికల కలకలం: టీడీపీ రిగ్గింగ్ కు పాల్పడిందని వైసీపీ తీవ్ర ఆరోపణలు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: అనంతపురం

అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ సమయంలో తెలుగుదేశం పార్టీ రిగ్గింగ్ కు పాల్పడిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ నేతృత్వంలో పోలింగ్ కేంద్రాలను తమ ఆధీనంలోకి తీసుకుని దాడులు చేశారని వైసీపీ నాయకులు ఆరోపించారు. ఈ అక్రమాలను అడ్డుకునేందుకు వెళ్లిన తమ నేతలను పోలీసులు అడ్డుకున్నారని, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని వైసీపీ నేతలు మండిపడ్డారు.