తమిళనాడులో హిందీ బోర్డుల కలకలం: స్టాలిన్ ఆగ్రహంతో ఇద్దరు అధికారుల సస్పెన్షన్
రిపోర్టర్: రమేష్
స్థలం: Thoothukudi
తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో రాష్ట్ర రహదారిపై ఏర్పాటు చేసిన హిందీ సైన్బోర్డుపై తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది. రాష్ట్రంలో హిందీని రుద్దే ప్రయత్నం జరుగుతోందంటూ డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ వివాదంపై తక్షణమే స్పందించిన ప్రభుత్వం, హిందీ అక్షరాలను తొలగించి ఇద్దరు రహదారుల శాఖ అధికారులను సస్పెండ్ చేసినట్లు శుక్రవారం ప్రకటించింది. ద్విభాషా విధానానికి విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.