తెనాలి మాజీ ఎమ్మెల్యే శివకుమార్ చీటింగ్ కేసు విచారణ: పోలీస్ స్టేషన్కు హాజరు

రిపోర్టర్: శివ స్థలం: గుంటూరు

గుంటూరు జిల్లా తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చీటింగ్ కేసులో పోలీసు విచారణకు హాజరయ్యారని సీఐ రాంబాబు తెలిపారు. ఫైనాన్స్ సంస్థ నుంచి కోట్ల రుణం తీసుకుని, ష్యూరిటీగా ఇచ్చిన స్థలంలో మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. హైకోర్టు ఆదేశాల మేరకు భార్యతో కలిసి తెనాలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు వచ్చి విచారణలో పాల్గొన్నారని, ఈ నెల 16న మరోసారి హాజరుకావాలని నోటీసులు ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు.