మంత్రి పదవి నుంచి తొలగింపుపై కొండా సురేఖ తీవ్ర అసంతృప్తి

రిపోర్టర్: కిరణ్ స్థలం: హైదరాబాద్

తెలంగాణ మంత్రివర్గం నుంచి తనను బర్తరఫ్ చేయడంపై కొండా సురేఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన వివరణ తీసుకోకుండానే కక్షపూరితంగా చర్యలు తీసుకున్నారని ఆమె ఆరోపించారు. తన కుమార్తె వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడం అన్యాయమని, పార్టీలోని ఇతర నేతల వ్యాఖ్యలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దని, అధికారిక సమాచారం కోసం వేచి చూడాలని ఆమె కోరారు.