గుజరాత్ అంబాజీ ఆలయ మోహన్థాల్ ప్రసాదానికి ప్రతిష్టాత్మక జిఐ ట్యాగ్ లభించింది
రిపోర్టర్: రమేష్
స్థలం: Banaskantha
గుజరాత్లోని ప్రసిద్ధ అంబాజీ ఆలయ మోహన్థాల్ ప్రసాదానికి అరుదైన గౌరవం దక్కిందని బనస్కంధ కలెక్టర్ మిహిర్ పటేల్ తెలిపారు. నవరాత్రి ఉత్సవాల తొలి రోజున ఈ ప్రసాదానికి భౌగోళిక గుర్తింపు జిఐ ట్యాగ్ లభించడం భక్తులకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందని ఆయన వెల్లడించారు. శెనగపిండి, నెయ్యి, పంచదారతో తయా రయ్యే ఈ సాంప్రదాయ మిఠాయికి చట్టపరమైన రక్షణ లభించిందని అధికారులు పేర్కొన్నారు.