విజయనగరం రాజకీయం: చిన్నశ్రీను కుమార్తె నామినేషన్‌పై చెలరేగిన తీవ్ర వివాదం
రిపోర్టర్: రాము
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయం వేడెక్కిందని వైసీపీ నేతలు తెలిపారు. తెర్లాం జెడ్పీటీసి స్థానం నుంచి టీడీపీ నేత మజ్జి శ్రీనివాసరావు కుమార్తె సహస్ర పోటీ చేస్తుండగా, ఆమె బీసీ కాకపోయినా నిబంధనలకు విరుద్ధంగా రిజర్వుడు స్థానంలో నామినేషన్ వేశారని వారు రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. తప్పుడు కుల ధ్రువీకరణ పత్రంతో నామినేషన్ దాఖలు చేశారని, దీనిపై కోర్టును ఆశ్రయిస్తామని జిల్లా వైసీపీ అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ హెచ్చరించారు.