రామడుగు గ్రామంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: రామడుగు

సిరికొండ మండలం రామడుగు గ్రామంలో సర్పంచ్ వరలక్ష్మి సంతోష్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తో పాటు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు రవి, పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామ అధికారులు తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు.