మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఉజ్వల భవితను సాధించాలి
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
చౌటుప్పల్ మండలంలోని విశాల భారతి పాఠశాలలో డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ చైతన్యక్రాంతి వర్ధన్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులు ప్లకార్డులతో ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ముత్యం శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.