ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఘనంగా ఆవిష్కృతమైన మువర్ణాల జెండా

రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి స్థలం: ఆత్మకూరు(ఎం)

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల అధ్యక్షులు కందటి అనంతరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన అమరవీరుల త్యాగాలను ఈ సందర్భంగా ఆయన స్మరించుకున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోందని ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పేర్కొన్నారు.