ఏపీలో గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదల

రిపోర్టర్: రమేష్ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 163 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, ఆర్టీవో వంటి కీలక పోస్టులకు అక్టోబర్ 6 నుంచి 27 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ వెల్లడించింది. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.