నాంపల్లిలో ఇండ్ల స్థలాల కబ్జాపై గ్రామస్తుల నిరసన
రిపోర్టర్: భాస్కర్
స్థలం: నల్గొండ
నాంపల్లి మండలం సుంకిశాల గ్రామంలో తమ ఇండ్ల స్థలాలు, గ్రామ కంఠం భూమిని తుమ్మలపల్లి రాజవర్ధన్ రెడ్డి దౌర్జన్యంగా కబ్జా చేస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థలం వద్ద టెంట్ వేసి నిరసన తెలిపారు. జేసీబీతో ఇళ్లను నేలమట్టం చేశారని, రెవెన్యూ అధికారులు స్పందించి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు.