వరంగల్ నిట్ డిప్యూటీ డైరెక్టర్‌గా ప్రొఫెసర్ రతీష్ కుమార్ నియామకం

రిపోర్టర్: సురేష్ స్థలం: హనుమకొండ

వరంగల్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డిప్యూటీ డైరెక్టర్‌గా ప్రొఫెసర్ పి.రతీష్ కుమార్ నియమితులయ్యారు. సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్న ఆయన, గతంలో డీన్‌గా మరియు విభాగాధిపతిగా వివిధ హోదాల్లో పనిచేశారు. బోధన, పరిశోధన రంగాల్లో ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ పదవి దక్కింది. కొత్త బాధ్యతలతో సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించనున్నారు.