సీఎంని ప్రశ్నించిన జర్నలిస్టుపై పోలీసుల దాడి

రిపోర్టర్: శ్రీకాంత్ రెడ్డి స్థలం: ఢిల్లీ

ఢిల్లీలో సీఎం రేఖా గుప్తాను ప్రశ్నించిన '4PM' జర్నలిస్ట్ షాహీన్ ఖాన్పై పోలీసులు దాడి చేశారు. సీఎంనే ప్రశ్నిస్తావా అంటూ ఆమెను, తోటి మహిళను పోలీసులు తీవ్రంగా కొట్టడంతో వారు అపస్మారక స్థితిలోకి వెళ్లారు.

జర్నలిస్ట్ పేరులో ఖాన్ ఉందని తెలిసి పోలీసులు మరింత రెచ్చిపోయి దాడి చేశారని బాధితురాలు కన్నీటిపర్యంతమయ్యారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించినందుకు జర్నలిస్టులపై ఇలాంటి దాడులు జరగడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.