ఎన్నికల్లో గొడవలు చేస్తే కఠిన చర్యలు తప్పవని అనంతపురం పోలీసుల హెచ్చరిక

రిపోర్టర్: రాము స్థలం: అనంతపురం

ఎన్నికల సమయంలో ఎలాంటి గొడవలకు పాల్పడినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అనంతపురం పోలీసులు తీవ్రంగా హెచ్చరించారు. బెదిరింపులు, విద్వేషపూరిత ప్రసంగాలు, తప్పుడు ప్రచారాలు చేసే వారిపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. ప్రజలందరూ ఎలాంటి భయాలు లేకుండా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం కోసం డయల్ 112 సేవలను సద్వినియోగం చేసుకోవాలని వారు ప్రజలకు సూచించారు.