ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ బడులను దత్తత తీసుకోవాలని డీకే శివకుమార్ పిలుపు
రిపోర్టర్: అశోక్
స్థలం: బెంగళూరు
గ్రామీణ ప్రాంతాల్ లోని ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు దత్తత తీసుకోవాలని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పిలుపునిచ్చారు. నమ్మ శాలే నమ్మ జవాబ్దారీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన, తొలి విడతగా రెండు వేల ప్రభుత్వ బడులను ప్రైవేట్ సంస్థలతో అనుసంధానం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఆర్థిక స్థోమతను బట్టి పాఠశాలల అభివృద్ధికి సహకరించాలని, ఉపాధ్యాయులను పంపడం లేదా ల్యాబ్ పరికరాలను అందించాలని ఆయన కోరారు.