కొబ్బరి పీచు వ్యర్థాలతో నీటిని శుభ్రం చేయొచ్చని అధ్యయనంలో వెల్లడి
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: India
కొబ్బరి పీచు వ్యర్థాల నుంచి సేకరించిన లిగ్నిన్తో నీటిలోని మలినాలను తొలగించవచ్చని రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ అధ్యయనంలో తేలింది. ఈ వ్యర్థాలతో తయారు చేసిన అమైనెటేడ్ లిగ్నిన్ కేవలం 80 నిమిషాల్లోనే నీటిలోని 95.5 శాతం కాంగో రెడ్ రంగును తొలగించినట్లు పరిశోధకులు గుర్తించారు. ఇది వ్యర్థాల నిర్వహణకు, మురుగునీటి శుద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.