పశ్చిమ గోదావరిలో విషాదం: గోదావరిలోకి దూకిన ఒకే కుటుంబం
రిపోర్టర్: వెంకట్
స్థలం: పశ్చిమ గోదావరి
పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చించినాడ వంతెనపై నుంచి గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో భార్య పద్మను స్థానిక జాలర్లు కాపాడగా, భర్త శ్రీనివాస్ మరియు ఇద్దరు పిల్లలు నీటి ప్రవాహంలో గల్లంతయ్యారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.