రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి నిప్పులు: కేటీఆర్ పొత్తు వ్యాఖ్యలపై కౌంటర్

రిపోర్టర్: మహేష్ స్థలం: హైదరాబాద్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధ్యతారహితమని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. రాజకీయ లబ్ధి కోసం హిందూ సమాజాన్ని కించపరిచేలా రేవంత్ మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీతో బీజేపీకి ఎలాంటి పొత్తు ఉండబోదని స్పష్టం చేసిన ఆయన, కేటీఆర్ పగటి కలలు కనడం మానుకోవాలని హితవు పలికారు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు.