రేణిగుంట రైల్వే స్టేషన్‌లో ఆత్మహత్యాయత్నం కలకలం
రిపోర్టర్: సునీల్
స్థలం: తిరుపతి
తిరుపతి జిల్లా రేణిగుంట రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తి ఉదయం నుంచి ఆత్మహత్య చేసుకుంటానంటూ ఫుట్‌పాత్ బ్రిడ్జిపై వేలాడుతూ హల్‌చల్ సృష్టించాడు. దీంతో రైల్వే అధికారులు అప్రమత్తమై హైటెన్షన్ విద్యుత్ లైన్ నిలిపివేసి, అగ్నిమాపక సిబ్బంది సహాయంతో ట్రాక్‌పై వల ఏర్పాటు చేసి అస్సాంకు చెందిన ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.