గిరిజనులకు అధికారం కట్టబెట్టిన ఘనత కేసీఆర్ కే దక్కుతుంది
రిపోర్టర్: KOLA MAHESH
స్థలం: నారాయణపురం
నారాయణపురం మండలంలోని పొర్లగడ్డ తండాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గులాబీ అధినేత కేసీఆర్ చిత్రపటానికి నాయకులు, మహిళలు ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు. గిరిజన తండాలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా మార్చి స్వపరిపాలన అందించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అంగోతు రాజు, ఉప సర్పంచ్ అంగోతు రాజు, వార్డు సభ్యులు ప్రేమల పాండు, కల్పనా కుమార్, లలిత రాజు తదితరులు పాల్గొన్నారు.