ఎమ్ సీడీ పాఠశాలల్లో యాభై వేల మంది విద్యార్థుల చేరికలే లక్ష్యంగా ప్రత్యేక డ్రైవ్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: దిల్లీ

దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు అధికారులు నడుం బిగించారు. ఇందులో భాగంగా నెల రోజుల్లోగా యాభై వేల మంది కొత్త విద్యార్థులను చేర్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎడ్యుకేషన్ కమిటీ చైర్మన్ యోగేష్ వర్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉపాధ్యాయులు ప్రతి శనివారం ఇంటింటికీ తిరిగి తల్లిదండ్రులను చైతన్యవంతం చేయాలని, పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరచాలని ఆదేశించారు.