విజయనగరం ఉత్సవాలు: సోమవారం హుకుంపేటకు పైడితల్లి అమ్మవారి సిరిమాను తరలింపు

రిపోర్టర్: రమేష్ స్థలం: విజయనగరం

విజయనగరం మండలం జొన్నవలసలో పూజలందుకున్న పైడితల్లి అమ్మవారి సిరిమాను, ఇరుసుమాను వృక్షాలను సోమవారం ఉదయం హుకుంపేటకు ఘనంగా తరలించనున్నట్లు తహసీల్దార్లు హేమంత్కుమార్, శ్రీనివాసరావు వెల్లడించారు. ఆదివారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. సోమవారం ఉదయం మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల ప్రత్యేక పూజల అనంతరం ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నగరంలో పకడ్బందీ ట్రాఫిక్ మళ్లింపు చర్యలు, భారీ భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పోలీసు అధికారులు స్పష్టం చేశారు.