తిరుపతి విమానాశ్రయంలో నారా లోకేష్కు ఘన స్వాగతం పలికిన గాలి

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: నగరి

తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా విమానాశ్రయానికి చేరుకున్న తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్కు నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానిక రాజకీయ పరిస్థితులు మరియు జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి చేరుకుని లోకేష్కు మద్దతు తెలపడంతో అక్కడ సందడి నెలకొంది. ఈ పర్యటన జిల్లా రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.