బెంగాల్లో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలన్న మమతా బెనర్జీ
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: పశ్చిమ బెంగాల్
పశ్చిమ బెంగాల్లో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని, సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ను వెంటనే అరెస్టు చేయాలని మాజీ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సర్ ప్రక్రియ ద్వారా దాదాపు 79 లక్షల ఓట్లను తొలగించి బీజేపీతో కలిసి భారీ కుట్ర చేశారని ఆమె తీవ్రంగా ఆరోపించారు.