విదేశీ సాయంతోనే మోదీ అధికారంలోకి వచ్చారంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ధ్వజం

రిపోర్టర్: సతీష్ స్థలం: న్యూఢిల్లీ

ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ సాయంతోనే అధికారంలోకి వచ్చారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సీఆర్ కేశవన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విదేశీ జోక్యానికి పాల్పడింది రాహుల్ గాంధీయేనని ఆయన విమర్శించారు. లండన్ పర్యటనలో భారత అంతర్గత విషయాలపై విదేశీ సహాయం కోరారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలకు జార్జ్ సోరోస్ సంస్థతో సంబంధాలు ఉన్నాయని, సోనియా గాంధీ ఆ సంస్థలో కీలక బాధ్యతలు నిర్వహించారని కేశవన్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.