హైదరాబాద్లో భారీ వర్షం: ఐటీ కారిడార్లో స్తంభించిన ట్రాఫిక్

రిపోర్టర్: హరి స్థలం: హైదరాబాద్

హైదరాబాద్ నగరం వాతావరణంలో అనూహ్య మార్పు చోటుచేసుకుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సాయంత్రం వేళ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసిందని, దీనితో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిందని వెల్లడించారు. శంషాబాద్, కూకట్పల్లి, గచ్చిబౌలి, హైటెక్ సిటీ తదితర ప్రాంతాల్లో వాన దంచికొట్టిందని పేర్కొన్నారు. ఆఫీసులు ముగించుకుని ఇళ్లకు వెళ్లే సమయంలో భారీ వర్షం పడటంతో రోడ్లపై తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు ఇబ్బంది పడ్డారని చెప్పారు.