'సర్దార్ పటేల్‌కు ఘన నివాళి': కిషన్ రెడ్డి
రిపోర్టర్: విజయ్
స్థలం: Hyderabad
హైదరాబాద్ లక్డీకాపూల్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల నేపథ్యంలో సర్దార్ పటేల్ దేశ సమైక్యతకు చేసిన సేవలను ఆయన స్మరించుకున్నారు. దేశ ప్రజల ఐక్యత కోసం పటేల్ చూపిన మార్గం అందరికీ ఆదర్శప్రాయమని జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులు అర్పించారు.