పురుషాధిక్య భావజాలం మారాలి: బంధాల పరిరక్షణపై డీజీ చారు సిన్హా

రిపోర్టర్: రమేష్ స్థలం: హైదరాబాద్

సమాజంలో వేళ్లూనుకుపోయిన కోపం, అహంకారం, పురుషాధిక్య భావజాలం మారాలని సీఐడీ, ఏసీబీ, మహిళా భద్రతా విభాగాల డీజీ చారు సిన్హా స్పష్టం చేశారు. హైదరాబాద్లోని అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వేదికగా జరిగిన స్టాండ్ విత్ హర్ చర్చా కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, పరస్పర గౌరవంతోనే ఆరోగ్యకరమైన బంధాలు సాధ్యమవుతాయని తెలిపారు. పురుషులు, మహిళలు ఒకరికొకరు పూరకాలని, ఆధిపత్య ధోరణులు విడనాడాలని ఉద్ఘాటించారు.