కాంగ్రెస్ పార్టీ తీరుపై అమిత్ షా తీవ్రస్థాయిలో ఆగ్రహం మరియు నిప్పులు

రిపోర్టర్: శివ స్థలం: న్యూదిల్లీ

1984 నాటి సిక్ కు వ్యతిరేక అల్లర్ల వార్షికోత్సవం నాడు దిల్లీలో రాజకీయ ర్యాలీ నిర్వహించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ బాధితుల గాయాలపై ఉప్పు జల్లుతోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చండీగఢ్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, నాటి అల్లర్లలో వేలాది మంది సిక్కులు దారుణ హత్యకు గురయ్యారని గుర్తుచేస్తూ కాంగ్రెస్ తీరును తీవ్రంగా ఖండించారు.