'ప్రజా పాలన దినోత్సవం': అమరులకు కాంగ్రెస్ నివాళి

రిపోర్టర్: సతీష్ స్థలం: తెలంగాణ

నిజాం నిరంకుశత్వాన్ని, రజాకార్ల దౌర్జన్యాలను ఎదిరించి తెలంగాణ స్వాతంత్య్ర సాధనలో అమరులైన వీరులకు తెలంగాణ కాంగ్రెస్ ఘనంగా నివాళులు అర్పించింది. సెప్టెంబర్ 17, 1948న తెలంగాణ భారతదేశంలో విలీనం అయిన చారిత్రక సందర్భాన్ని స్మరించుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ తెలంగాణ కాంగ్రెస్ అధికారికంగా ప్రత్యేక సందేశాన్ని వెలువరించింది.