అర్హులైన నిరుపేదలందరికీ ఉపాధి హామీ పనులు కల్పించాలని అధికారుల ఆదేశం
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
విబిజి రాంజీ పథకం ద్వారా నిరుపేదలకు ఉపాధి కల్పించాలని రాష్ట్ర ఉన్నతాధికారులు ఆదేశించారు. బుధవారం మంచిర్యాల జిల్లా జన్నారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో స్థానిక అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలో చేపట్టిన ఉపాధి హామీ పనులు వాటి ప్రగతిపై ఉన్నతాధికారులు అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఉపాధిని కల్పించాలని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.