వైభవంగా సాగుతున్న పత్తికొండ బ్రహ్మోత్సవాలు భక్తులకు ఆహ్వానం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పత్తికొండ
పత్తికొండలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వేలాది మంది భక్తులు దర్శనాలు చేసుకుంటున్నారని, రోజూ ఒక వాహన సేవ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భరతనాట్యాలు, కోలాటాలు, చెక్క భజనలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏమాత్రం ఆపకుండా అత్యంత వైభవంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాలు ఈ నెల 14వ తేదీ నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు జరుగుతాయని, మూడో తేదీన పుష్పయాగం ఉంటుందని వెల్లడించారు. వివిధ ప్రాంతాల ప్రజలు వచ్చి బ్రహ్మోత్సవాలను దర్శించుకోవాలని కోరారు.