'పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ అక్రమ మైనింగ్': చినరాజప్ప కుమారుడి అనుచరులపై ఎన్జీటీ సీరియస్
రిపోర్టర్: గోపి
స్థలం: Peddapuram
పెద్దాపురం రామేశ్వరం మెట్టలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. టీడీపీ ఎమ్మెల్యే చినరాజప్ప కుమారుడి అనుచరులు చేపట్టిన ఈ అక్రమ మైనింగ్ పనులను తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. అక్రమ మైనింగ్‌తో పర్యావరణాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తున్నారని మండిపడిన ఎన్జీటీ, నవంబర్ 4లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది.