రహదారి దుస్థితిపై సోషల్ మీడియా పోస్ట్: గ్రామాన్ని సందర్శించిన శిల్పారెడ్డి

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఆత్మకూరు

ఆత్మకూరు మండలం నలపరెడ్డిపల్లి, మురగళ్ల, కనుపూరుపల్లి రహదారి అధ్వాన స్థితిపై వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ నాయకుడు తోడేటి అశోక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్గా మారింది. ఈ అంశంపై స్పందించిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ బండి శిల్పారెడ్డి మురగళ్ల గ్రామాన్ని నేరుగా సందర్శించారు. ప్రజా సమస్యపై సానుకూలంగా స్పందించి ఊరికి విచ్చేసిన ఆమెను తోడేటి అశోక్ కుటుంబ సభ్యులు శాలువాతో ఘనంగా సత్కరించి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసినట్లు స్థానికులు వెల్లడించారు.